KCR: కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఆరా

Revanth Reddy and Bandi Sanjay inquire about KCRs health condition
  • సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కేసీఆర్
  • వైద్యులు, అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • అత్యుత్తమ చికిత్స అందించాలని ముఖ్యమంత్రి ఆదేశం
  • కేసీఆర్ త్వరగా ప్రజా జీవితంలోకి తిరిగి రావాలన్న బండి సంజయ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వైద్యులు, అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు.

కేసీఆర్‌కు అత్యుత్తమ చికిత్స అందించాలని ఆయన ఆదేశించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. గురువారం సాయంత్రం స్వల్ప అనారోగ్యంతో కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరగా, వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు.

కేసీఆర్ ఆరోగ్యం పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న బండి సంజయ్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తాను అడిగి తెలుసుకున్నట్లు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఆయనకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. అనారోగ్యం నుంచి బయటపడి, ఆయన వీలైనంత త్వరగా తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తన సందేశంలో వెల్లడించారు.
KCR
KCR health
Revanth Reddy
Bandi Sanjay
Yashoda Hospital
Telangana
BRS
KCR health update

More Telugu News