Priyanka Chopra: మహేశ్ బాబు సినిమాపై ప్రియాంక చోప్రా కీలక వ్యాఖ్యలు

- ఈ ఏడాది ఒక భారతీయ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పిన ప్రియాంక చోప్రా
- ఆ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడి
- ఇది మహేశ్ బాబు-రాజమౌళి సినిమానేనని ఫ్యాన్స్ సంబరాలు
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. తాను ఈ ఏడాది ఒక భారతీయ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రియాంక చెప్పడంతో, మహేశ్ బాబుతో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ గురించేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ఓ కీలకపాత్రను పోషిస్తున్నారు.
వివాహం తర్వాత హాలీవుడ్‌లో స్థిరపడిన ప్రియాంక చోప్రా, ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తాను ఇండియాను, ఇక్కడి సినిమాలను చాలా మిస్ అవుతున్నట్లు తెలిపారు. "ఈ సంవత్సరం నేను ఓ భారతీయ చిత్రంలో నటిస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. భారతీయ ప్రేక్షకులు నాపై చూపించే ప్రేమ ఎంతో విలువైనది" అని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ షూటింగ్ దశలో ఉంది. అటవీ నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ థ్రిల్లర్‌ను రాజమౌళి భారీ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరికొత్త లుక్‌తో, మునుపెన్నడూ చూడని పాత్రలో అలరించనున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదే ఇంటర్వ్యూలో, తనకు ఊహ తెలిశాక థియేటర్‌లో చూసిన మొదటి సినిమా మణిరత్నం ‘బొంబాయి’ అని, ఆ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని ప్రియాంక గుర్తుచేసుకున్నారు.