F-35B Fighter Jet: కేరళలో చిక్కుకున్న బ్రిటన్ ఫైటర్ జెట్.. రెక్కలు విడదీసి తరలింపునకు ఏర్పాట్లు!

- కేరళలో అత్యవసరంగా ల్యాండ్ అయిన బ్రిటన్ ఎఫ్-35బి ఫైటర్ జెట్
- మరమ్మతులు విఫలం కావడంతో అక్కడే నిలిచిపోయిన విమానం
- సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానంలో యూకేకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు
- కార్గో విమానంలో పట్టకపోవడమే రెక్కలు తీయడానికి ప్రధాన కారణం
బ్రిటన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్-35బి స్టెల్త్ ఫైటర్ జెట్ ఒకటి కేరళలో చిక్కుకుపోయింది. సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఈ విమానానికి మరమ్మతులు చేయడం సాధ్యం కాకపోవడంతో, ఇప్పుడు దానిని విడిభాగాలుగా చేసి స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల్లో ఒకటిగా పేరున్న దీనిని ఇలా రెక్కలు విడదీసి తీసుకెళ్లాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది.
బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన ఈ యుద్ధ విమానం జూన్ 14న సాంకేతిక సమస్య కారణంగా తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. దీనిని బాగుచేసేందుకు బ్రిటన్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన 40 మంది ఇంజనీర్ల బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రెండు వారాలు దాటినా సమస్యను పరిష్కరించలేకపోవడంతో, విమానాన్ని తిరిగి యూకేకి తరలించడమే ఉత్తమమని అధికారులు నిర్ణయించారు.
రక్షణ రంగ నిపుణుల ప్రకారం ఈ ఫైటర్ జెట్‌ను సీ-17 గ్లోబ్‌మాస్టర్ అనే భారీ రవాణా విమానంలో యూకేకి తీసుకెళ్లనున్నారు. అయితే, ఎఫ్-35 విమానం రెక్కల వెడల్పు దాదాపు 11 మీటర్లు ఉండగా, సీ-17 కార్గో హోల్డ్ వెడల్పు కేవలం 4 మీటర్లు మాత్రమే. దీంతో విమానాన్ని నేరుగా లోపలికి ఎక్కించడం సాధ్యం కాదు. అందుకే, దాని రెక్కలను వేరు చేసి, విమాన భాగాన్ని చిన్నదిగా మార్చి తరలించాలని నిర్ణయించారు.
అత్యాధునిక ఐదో తరం స్టెల్త్ విమానం రెక్కలను విడదీయడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇలా చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో అమెరికా, దక్షిణ కొరియాలో కూడా ఇదే తరహాలో ఎఫ్-35 విమానాల రెక్కలను తొలగించి ఇతర ప్రాంతాలకు తరలించిన సందర్భాలు ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసి విమానాన్ని యూకేకు తరలించే అవకాశం ఉంది.