Pawan Kalyan: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'హరిహర వీరమల్లు'.. 24 గంటల్లోనే ఆల్ టైమ్ రికార్డు!

Pawan Kalyans Hari Hara Veera Mallu Trailer Creates YouTube Record
  • యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న 'హరిహర వీరమల్లు' ట్రైలర్
  • 24 గంటల్లోనే తెలుగులో 48 మిలియన్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డు
  • అన్ని భాషల్లో కలిపి 61.7 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన వైనం
  • ఈ నెల‌ 24న థియేటర్లలోకి సినిమా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రం విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ నెల‌ 24న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో గురువారం విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్, యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను తిరగరాసింది. విడుదలైన కేవలం 24 గంటల్లోనే ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అసాధారణ స్పందన లభించింది.

ఒక్క తెలుగు వెర్షన్ ట్రైలరే 48 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, టాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఇక అన్ని భాషల్లో కలిపి ఈ ట్రైలర్‌కు 24 గంటల్లోనే 61.7 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఇది కేవలం ఒక రికార్డు మాత్రమే కాదని, భవిష్యత్తులో రాబోయే సినిమాలకు ఒక హెచ్చరిక అని కూడా చిత్రబృందం పేర్కొంది.

చారిత్రక కథాంశంతో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పిస్తున్నారు. 

మొదట ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించగా, కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో మిగిలిన భాగాన్ని జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది.
Pawan Kalyan
Hari Hara Veera Mallu
Nidhi Agarwal
Krish Jagarlamudi
Telugu movie trailer
Bobby Deol
AM Ratnam
Mega Surya Production
Tollywood records
historical drama

More Telugu News