Devineni Avinash: 2029లో ఎన్టీఆర్ జిల్లాలో తొలి గెలుపు దేవినేని అవినాశ్ దే: మోదుగుల

Modugula predicts Devineni Avinash victory in NTR district in 2029 election
  • ఎన్టీఆర్ జిల్లా పార్టీ బాధ్యతలను అవినాశ్ భుజాలపై మోస్తున్నారన్న మెదుగుల
  • ప్రజలు చంద్రబాబును గెలిపించి వాళ్లు ఓడిపోయారని వ్యాఖ్య
  • చంద్రబాబు మోసాలను ప్రజలందరికీ వివరించాలని పిలుపు
2029 ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ తరఫున దేవినేని అవినాశ్ గెలుపు ఖాయమని, జిల్లాలో పార్టీ జెండా ఎగరేసే మొట్టమొదటి వ్యక్తి ఆయనే అవుతారని వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో పార్టీని అవినాశ్ తన భుజస్కంధాలపై మోస్తున్నారని ఆయన కొనియాడారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను గుర్తుచేస్తూ రూపొందించిన 'రీకాలింగ్ చంద్రబాబు'స్ మేనిఫెస్టో' డాక్యుమెంటరీని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ తో కలిసి ఆయన క్యూఆర్ కోడ్ ద్వారా విడుదల చేశారు.

ఈ సందర్భంగా మోదుగుల మాట్లాడుతూ, వైఎస్ జగన్ ఓడిపోయిన తర్వాతే ఆయన విలువ ప్రజలకు అర్థమవుతోందన్నారు. "ప్రజలు చంద్రబాబును గెలిపించి, తాము ఓడిపోయారు. కూటమి నేతలు రేపు అధికారంలో ఉంటామో లేదో అన్నట్లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు" అని ఆయన ఆరోపించారు. తూర్పు నియోజకవర్గంలో కడియాల బుచ్చిబాబు పార్టీకి కొండంత అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు.

చంద్రబాబు ఇచ్చిన తప్పుడు హామీలను, మోసాలను ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. 'బాబు షూరిటీ మోసం గ్యారంటీ' అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళితే, కూటమి నేతలు రోడ్లపై కూడా తిరగలేని పరిస్థితి వస్తుందని మోదుగుల పేర్కొన్నారు. 
Devineni Avinash
NTR district
YSR Congress Party
Modugula Venugopal Reddy
2029 elections
Andhra Pradesh politics
Chandrababu Naidu
YS Jagan
Telugu Desam Party
election manifesto

More Telugu News