Vijayawada Highway: విజయవాడ హైవేపై ప్రమాదం.. ఒకేసారి ఢీకొన్న మూడు కార్లు

- యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వద్ద రోడ్డు ప్రమాదం
- హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఘటన
- ఒకదానికొకటి ఢీకొన్న మూడు కార్లు
- ముందు కారు సడన్‌గా బ్రేక్ వేయడమే కారణం
- ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు, అందరూ సురక్షితం
యాదాద్రి భువనగిరి జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం రెడ్డిబావి వద్ద మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఒక కారు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేశారు. దీంతో, ఆ కారు వెనుక వస్తున్న మరో కారు ఢీకొట్టింది. దాంతో రెండో కారును వెనుకగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార్ల ముందు భాగాలు, బంపర్లు దెబ్బతిన్నాయి.
అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఆకస్మికంగా బ్రేకుల వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు.