Anirudh Reddy: చంద్రబాబు కోవర్టులు ఉన్నారని వ్యాఖ్య: పార్టీ ఎమ్మెల్యేపై టీపీసీసీ సీరియస్!

- తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
- బనకచర్ల ప్రాజెక్టు ఆపాలంటే వారి కాంట్రాక్టులు, కరెంట్ కట్ చేయాలని వ్యాఖ్య
- ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాస్తే సరిపోదని వ్యాఖ్య
- ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం
- పూర్తి నివేదిక ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీకి ఆదేశం, షోకాజ్ నోటీసుల జారీకి అవకాశం
తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన టీపీసీసీ నాయకత్వం ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం లేఖలు రాస్తే సరిపోదని, తెలంగాణలో ఉన్న చంద్రబాబు కోవర్టులకు కాంట్రాక్టులు, కరెంట్, నీటి కనెక్షన్లు నిలిపివేయాలని అనిరుధ్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు ఆపివేస్తే, బనకచర్ల ప్రాజెక్టు దానంతట అదే ఆగిపోతుందని ఆయన పేర్కొన్నారు.
ఆయన చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వెంటనే సమగ్ర నివేదిక సమర్పించాలని పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. సోమవారం క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుండగా, ఆ తర్వాత అనిరుధ్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.