Allu Aravind: ఈడీ విచారణపై స్పందించిన నిర్మాత అల్లు అరవింద్

Allu Aravind Responds to ED Inquiry
  • ఈరోజు అరవింద్‌ను మూడు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు
  • ఓ ప్రాపర్టీలో మైనర్ వాటాదారుడి భాగాన్ని కొనుగోలు చేసినట్లు అల్లు అరవింద్ వెల్లడి
  • మైనర్ వాటాదారుడు బ్యాంకు నుంచి రుణం తీసుకొని చెల్లించలేదన్న అరవింద్
  • అకౌంట్స్ బుక్‌లో తన పేరు ఉండటం వల్ల ఈడీ విచారణకు పిలిచిందని వెల్లడి
ఈడీ విచారణపై ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. 2017లో ఓ ప్రాపర్టీలో ఒక మైనర్ వాటాదారుడి భాగాన్ని తాను కొనుగోలు చేశానని ఆయన తెలిపారు. ఆ ప్రాపర్టీకి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి కొన్ని సమస్యలు ఉన్నాయని ఆయన అన్నారు. ఆ మైనర్ వాటాదారుడు బ్యాంకు నుంచి రుణం తీసుకొని చెల్లించలేదని ఆయన పేర్కొన్నారు.

అకౌంట్స్ బుక్‌లో తన పేరు ఉండటం వల్ల ఈడీ విచారణకు పిలిచిందని ఆయన వెల్లడించారు. బాధ్యత గల పౌరుడిగా తాను విచారణకు హజరయ్యానని తెలిపారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని అల్లు అరవింద్ తెలియజేశారు.

ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌ను ఈడీ అధికారులు రెండు రోజుల క్రితం విచారించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థకు సంబంధించిన రూ.101 కోట్ల బ్యాంక్ రుణ మోసం కేసులో ఆయనను సుమారు మూడు గంటల పాటు ప్రశ్నించి, వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.
Allu Aravind
ED Investigation
Enforcement Directorate
Geetha Arts

More Telugu News