Donald Trump: 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'కు చట్టబద్ధత.. సంతకం చేసిన ట్రంప్

- 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'పై సంతకం చేసిన అధ్యక్షుడు ట్రంప్
- పన్నుల కోతలు, వ్యయ నియంత్రణలే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం
- సెనెట్‌లో టై బ్రేకర్ ఓటుతో గట్టెక్కిన బిల్లు
- ప్రతినిధుల సభలోనూ స్వల్ప మెజారిటీతోనే ఆమోదం
- ఇరు సభల్లోనూ కొందరు రిపబ్లికన్లు వ్యతిరేకంగా ఓటు వేయడం గమనార్హం
అమెరికాలో పన్నుల కోతలు, ప్రభుత్వ వ్యయ నియంత్రణల కోసం ఉద్దేశించిన ప్రతిష్ఠాత్మక 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు' చట్టంగా మారింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ బిల్లుపై సంతకం చేయడంతో ఇది అధికారికంగా అమల్లోకి వచ్చింది. రిపబ్లికన్ పార్టీ సభ్యులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తుండగా ట్రంప్ ఈ చట్టాన్ని ఆమోదించారు. అయితే, ఈ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందడానికి తీవ్రమైన రాజకీయ ఉత్కంఠ నడిచింది.
ఈ బిల్లుపై సెనెట్‌లో జరిగిన ఓటింగ్‌లో ఇరుపక్షాల బలాబలాలు సమానంగా నిలిచాయి. ముగ్గురు రిపబ్లికన్ సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. ఆ సమయంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన టై బ్రేకర్ ఓటును వినియోగించడంతో 51-50 తేడాతో బిల్లు గట్టెక్కింది. దీంతో ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది.
సెనెట్‌లో ఆమోదం పొందిన అనంతరం ఈ బిల్లు ప్రతినిధుల సభ ముందుకు వచ్చింది. అక్కడ కూడా హోరాహోరీ చర్చ జరిగి, స్వల్ప ఆధిక్యంతోనే ఆమోదం లభించింది. ప్రతినిధుల సభలో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 218 ఓట్లు రాగా, 214 మంది వ్యతిరేకించారు. ఇక్కడ కూడా ఇద్దరు రిపబ్లికన్ సభ్యులు బిల్లును వ్యతిరేకించడం గమనార్హం. ఇరు సభల్లోనూ స్వల్ప మెజారిటీతో ఆమోదం పొందిన ఈ బిల్లుపై ట్రంప్ సంతకంతో చట్టబద్ధత చేకూరింది.