Buddha Rajasekhar Reddy: టీడీపీ అధిష్ఠానం వద్దకు చేరిన శ్రీశైలం రగడ

Srisailam TDP Dispute Reaches Party Leadership
  • శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మధ్య వివాదం
  • ఎమ్మెల్యే లేకుండానే మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డితో కలిసి ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బైరెడ్డి శబరి
  • పరస్పర ఆరోపణలతో అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసుకున్న నేతలు
  • పార్టీ అధినేత చంద్రబాబు ముందు ఇద్దరు నేతలు హాజరు కావాలని ఆదేశించిన పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
శ్రీశైలం నియోజకవర్గంలో తలెత్తిన తెలుగుదేశం పార్టీ నేతల వివాదం పార్టీ అధిష్ఠానం దృష్టికి చేరింది. శ్రీశైలం శాసనసభ్యుడు బుడ్డా  రాజశేఖర్ రెడ్డి, నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి మధ్య నెలకొన్న విభేదాలను పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది.

స్థానిక శాసనసభ్యుడు లేకుండా మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డితో ఎంపీ శబరి ఇటీవల ఒక కార్యక్రమం నిర్వహించడం వివాదాస్పదమైంది. దీనిపై అధిష్ఠానం వివరణ కోరగా, ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నాయి. నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలుగా తెలుగుదేశం పార్టీ నేతలు చీలిపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖరరెడ్డి, పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరికి పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. ఇరువురు నేతలు అమరావతికి వచ్చి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు హాజరుకావాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు. 
Buddha Rajasekhar Reddy
Srisailam
TDP
Byreddy Shabari
Nandyal MP
Andhra Pradesh Politics
Chandra Babu Naidu
Palla Srinivasa Rao
Erasu Pratap Reddy

More Telugu News