Pushkar Singh Dhami: రైతుగా మారిన సీఎం.. కాడెద్దులతో పొలం దున్నిన వైనం.. వీడియో వైరల్

CM Pushkar Singh Dhami Turns Farmer Plows Field Video Viral
  • రైతుగా మారిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి
  • కాడెద్దులతో సంప్రదాయ పద్ధతిలో పొలాన్ని దున్నిన వైనం
  • స్థానిక రైతులతో కలిసి ఉత్సాహంగా వరి నాట్లు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
నిత్యం అధికారిక సమీక్షలు, సమావేశాలతో తీరిక లేకుండా గడిపే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, అందుకు భిన్నంగా ఓ కొత్త పాత్రలో కనిపించారు. ఏకంగా రైతు అవతారమెత్తి, పొలంలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాడెద్దులతో నాగలి పట్టి పొలాన్ని దున్ని, స్థానిక రైతులతో కలిసి వరి నాట్లు వేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ముఖ్యమంత్రి ధామి తన సొంత పొలంలో సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయ పనులు చేపట్టారు. కాడెద్దులతో నాగలి పట్టి పొలాన్ని దుక్కి దున్నారు. అనంతరం అక్కడున్న స్థానిక రైతులతో కలిసిపోయి ఉత్సాహంగా వరి నాట్లు వేశారు. సీఎం సామాన్యుడిలా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవ్వడంతో ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా వ్యవసాయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. రైతులంతా వరి నాట్లు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో రైతులకు భరోసా కల్పిస్తూ వారిలో ఒకరిగా సీఎం ధామి పొలం పనుల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండటం, వరదలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.
Pushkar Singh Dhami
Uttarakhand CM
Uttarakhand agriculture
farming
Indian farmers
traditional farming
rice cultivation
viral video
agriculture
Uttarakhand rains

More Telugu News