Ramayana: కళ్లుచెదిరే బడ్జెట్‌తో రణ్‌బీర్ ‘రామాయణ’ .. రెండు భాగాలకు ఏకంగా రూ.1600 కోట్లు!

Ranbir Kapoor Ramayana Budget a staggering 1600 crore
  • తొలి భాగానికి రూ.900 కోట్లు, రెండో భాగానికి రూ.700 కోట్లు
  • భారత సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రికార్డు
  • రాముడిగా రణ్‌బీర్‌, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్‌
  • 2026 దీపావళికి మొదటి భాగం విడుదల చేసేందుకు ప్లాన్
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ‘రామాయణ’ సినిమాపై ఓ భారీ వార్త సోష‌ల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని ఏకంగా రూ.1600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదే నిజమైతే భారత సినీ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన చిత్రంగా నిలవడం ఖాయం.

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగాన్ని రూ. 900 కోట్లతో, రెండో భాగాన్ని రూ. 700 కోట్లతో నిర్మిస్తున్నారనేది ఆ వార్త‌ల సారాంశం. మొదటి భాగంలో రామాయణ ప్రపంచాన్ని సృష్టించేందుకు భారీ సెట్టింగులు వేస్తుండటంతో బడ్జెట్ ఎక్కువగా ఉందని, రెండో భాగంలో ప్రధానంగా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది.

ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తుండగా, కన్నడ స్టార్ యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ నటిస్తున్నారు. కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ పేర్లు వినిపిస్తున్నాయి. నేటి తరానికి రామాయణ గాథను ఓ అద్భుతమైన విజువల్ వండర్‌గా అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు ఈ భారీ బడ్జెట్‌కు వెనుకాడడం లేదని సమాచారం.

ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2026 దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి కొనసాగింపుగా రెండో భాగాన్ని 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Ramayana
Ranbir Kapoor
Nitesh Tiwari
Sai Pallavi
Yash
Bollywood Movie
Indian Cinema
Mythological Drama
Ramayana Budget
Sunny Deol

More Telugu News