Suresh Raina: సురేశ్ రైనా సినీ ప్రవేశం.. వెండితెరపై మెరవనున్న 'చిన్న తలా'

- క్రికెట్ నేపథ్యంలో సాగనున్న చిత్రం
- చెన్నైలో అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ
- వర్చువల్‌గా ఈవెంట్లో పాల్గొన్న మిస్టర్ ఐపీఎల్
- ఇప్పటికే సినిమాల్లోకి వచ్చిన ఇర్ఫాన్, హర్భజన్, ధావన్
టీమిండియా మాజీ స్టార్ ఆటగాడు, 'చిన్న తలా'గా అభిమానులకు సుపరిచితుడైన సురేశ్ రైనా ఇప్పుడు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. క్రికెట్ పిచ్‌పై తనదైన ముద్ర వేసిన రైనా, ఇప్పుడు నటనలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
ఆయన ఓ తమిళ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు. క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి లోగాన్ దర్శకత్వం వహించనున్నారు. డ్రీమ్ నైట్ స్టోరీస్ (డీకేఎస్) పతాకంపై శ్రవణకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించడం ద్వారా రైనాకు తమిళనాడుతో బలమైన అనుబంధం ఉంది.
ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి క్రికెటర్ శివమ్ దూబే హాజరై నిర్మాణ సంస్థ లోగోను ఆవిష్కరించారు. ప్రస్తుతం తన కుటుంబంతో నెదర్లాండ్స్‌లో ఉన్న రైనా, ఈ ఈవెంట్లో వర్చువల్‌గా పాల్గొని తన సంతోషాన్ని పంచుకున్నాడు.
సురేశ్ రైనా కంటే ముందే పలువురు భారత క్రికెటర్లు సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఇర్ఫాన్ పఠాన్ 'కోబ్రా' చిత్రంలో, హర్భజన్ సింగ్ 'ఫ్రెండ్షిప్' సినిమాలో నటించారు. శిఖర్ ధావన్ కూడా బాలీవుడ్ చిత్రంలో మెరిశాడు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నిర్మాతగా మారి 'లెట్స్ గెట్ మ్యారీడ్' (ఎల్జీఎం) చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు అదే బాటలో రైనా కూడా సినిమా ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు.