Narasimha Murthy Raju: ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్య

Aditya Pharmacy MD Narasimha Murthy Raju commits suicide
  • నిన్న హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న నరసింహమూర్తిరాజు
  • క్షత్రియ భవన్‌లో ఆదిత్య ఫార్మసీ ఎండీ బలవన్మరణం
  • పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం ఆసుపత్రికి తరలింపు
ఆదిత్య ఫార్మసీ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహమూర్తి రాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయవాడలోని క్షత్రియ భవన్‌లో ఆయన మరణించినట్లు గుర్తించారు. గత సంవత్సరం జరిగిన ఒక స్నేహితుడి హత్య కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఇటీవలే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.

ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. నరసింహమూర్తి రాజు శుక్రవారం హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్నారు.
Narasimha Murthy Raju
Aditya Pharmacy
Vijayawada
Suicide
Kshatriya Bhavan
Murder Case
Bail
Hyderabad

More Telugu News