Rishabh Pant: పంత్ కొట్టాడు కానీ... బాల్ మిస్... బ్యాట్ కూడా మిస్... వీడియో ఇదిగో!

Rishabh Pant Misses Ball But Bat Flies in England Test
  • ఇంగ్లండ్‌తో టెస్టులో చోటుచేసుకున్న ఆసక్తికర ఘటన
  • భారీ షాట్‌కు యత్నించి చేజారిన రిషభ్ పంత్ బ్యాట్
  • గాల్లోకి లేచి లెగ్ సైడ్ వైపు దూరంగా పడిపోయిన బ్యాట్
  • మైదానంలో నవ్వులు పూయించిన సరదా దృశ్యం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులతో రాణించిన పంత్
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన దూకుడైన ఆటతీరుతో మైదానంలో ఎంతటి అలజడి సృష్టిస్తాడో అందరికీ తెలిసిందే. అయితే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో అతని దూకుడు మరో రూపం తీసుకొని మైదానంలో నవ్వులు పూయించింది. అతను కొట్టబోయిన షాట్‌కు బంతి బదులు బ్యాటే గాల్లోకి లేచి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న రెండో టెస్టులో.. నాలుగో రోజు ఆటలో ఆసక్తికర ఘటన జరిగింది. ఇంగ్లండ్ పేసర్ కార్స్ విసిరిన బంతిని భారీ షాట్ కొట్టబోయిన్ పంత్ లైన్ మిస్సయ్యాడు. బంతి వెళ్లి కీపర్ చేతుల్లో పడగా... పంత్ చేతిలో బ్యాట్ జారిపోయింది. ఆ ఊపుకు బ్యాట్ వెళ్లి లెగ్ సైడ్ దూరంగా పడింది. దాంతో పంత్ నడుచుకుంటూ వెళ్లి బ్యాట్ ను తెచ్చుకున్నాడు. ఇది చూసి అందరూ నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక ఈ ఇన్నింగ్స్ లో పంత్ అవుటైనప్పుడు కూడా బ్యాట్ ఇలాగే జారిపోయి దూరంగా పడింది.

ఈ ఇన్నింగ్స్ లో పంత్ ధాటిగా ఆడి 65 పరుగులు చేశాడు. పంత్ 58 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు.
Rishabh Pant
India vs England
Edgbaston Test
Cricket
Test Match
Ben Foakes
Zak Crawley
Stuart Broad
Cricket Highlights

More Telugu News