Chandrababu Naidu: టీడీపీ కార్యకర్తకు క్యాన్సర్... వీడియో కాల్ మాట్లాడిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Talks to TDP Worker with Cancer on Video Call
  • క్యాన్సర్‌తో బాధపడుతున్న టీడీపీ కార్యకర్త ఆకుల కృష్ణ
  • చంద్రబాబుతో మాట్లాడాలన్న తన కోరిక వెల్లడి
  • విషయం తెలుసుకొని స్వయంగా వీడియో కాల్ చేసిన సీఎం
  • కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ముఖ్యమంత్రి
  • అన్ని విధాలా అండగా ఉంటానని కుటుంబానికి భరోసా
  • సీఎం ఫోన్‌తో సంతోషం వ్యక్తం చేసిన కార్యకర్త
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీకి చెందిన ఓ కార్యకర్త పట్ల మానవత్వం చాటుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతూ తీవ్ర అనారోగ్యంతో ఉన్న అభిమానికి స్వయంగా వీడియో కాల్ చేసి పరామర్శించి, ఆయన చివరి కోరికను నెరవేర్చారు.

రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని మోరంపూడి జంక్షన్‌కు చెందిన ఆకుల కృష్ణ, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి వీరాభిమానిగా ఉన్నారు. చంద్రబాబు అంటే ఆయనకు ఎనలేని అభిమానం. అయితే, కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో, జీవితంలో ఒక్కసారైనా చంద్రబాబుతో మాట్లాడాలని తన ఆకాంక్షను వెలిబుచ్చారు.

ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. ఆకుల కృష్ణకు నేరుగా వీడియో కాల్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని కృష్ణకు, ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. సరిగా మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేయడంతో ఆకుల కృష్ణ తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు తనకు ఎంతో సంతృప్తిగా ఉందని తెలిపారు.
Chandrababu Naidu
TDP
TDP Activist
Akula Krishna
Cancer Patient
Andhra Pradesh
Rajahmundry
Video Call
Political News
Telugu Desam Party

More Telugu News