Pawan Kalyan: 'ది 100' ట్రైలర్ లాంచ్ చేసిన పవన్ కల్యాణ్

Pawan Kalyan Launches The 100 Movie Trailer
  • ఈ నెల 11న విడుదల కానున్న 'ది 100'
  • ఆర్కే సాగర్ కథానాయకుడిగా రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  'ది 100'
ఆర్కే సాగర్ కథానాయకుడిగా, మిషా నారంగ్ కథానాయికగా రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ది 100'. ఈ చిత్రం జులై 11న విడుదల కానుంది. ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమేశ్ కరుటూరి, వెంకీ పూశడపు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ సినిమా టీజర్, పాటలు విశేషమైన స్పందనను రాబట్టాయి. తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విడుదల చేశారు. "జీవితంలో జరిగిపోయింది మనం మార్చలేం, కానీ జరగబోయేదాన్ని కచ్చితంగా ఆపొచ్చు.." అంటూ సాగే ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో ఐపీఎస్ విక్రాంత్ పాత్రలో ఆర్కే సాగర్ కనిపించనున్నారు.

ఆయుధం చేత పట్టకూడదని తనకి తానుగా ఒక నిర్ణయం తీసుకున్నాడు ఐపీఎస్ అధికారి విక్రాంత్. అప్పటి నుంచి ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? తన నిర్ణయాన్ని మార్చుకుని మళ్లీ ఆయుధం చేతపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలు తెలియాలంటే 'ది 100' చూడాల్సిందే. 
Pawan Kalyan
The 100 Movie
RK Sagar
Misha Narang
Raghav Omkar Shashidhar
Telugu Movie Trailer
Andhra Pradesh
Vikrant IPS
Dharma Productions
Telugu Cinema

More Telugu News