Mohammed Sharif: శివుడి అభిషేకానికి వాడే పాలలో ఉమ్మి.. సీసీటీవీలో బయటపడ్డ పాల వ్యాపారి దారుణం.. వీడియో ఇదిగో!

Lucknow Milk Vendor Mohammed Sharif Arrested for Spitting in Milk
  • లక్నోలో పాలు పోసే డబ్బాలో ఉమ్మివేసిన పాల వ్యాపారి
  • సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డైన దృశ్యాలు
  • పప్పు పేరుతో పాలుపోస్తున్న వ్యక్తి అసలు పేరు మహమ్మద్ షరీఫ్
  • నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల డిమాండ్
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అత్యంత దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నిత్యం శివుడికి అభిషేకం చేసేందుకు వినియోగించే పాలలో ఓ వ్యాపారి ఉమ్మి వేసిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డవడంతో నిందితుడి బండారం బయటపడింది.

గోమతి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. లవ్ శుక్లా అనే వ్యక్తి ఇంటికి పాలు పోసేందుకు వచ్చిన ఓ వ్యాపారి, కాలింగ్ బెల్ నొక్కిన తర్వాత చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని పాల డబ్బాలో ఉమ్మి వేశాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ఫుటేజ్‌ను చూసి దిగ్భ్రాంతికి గురైన శుక్లా, తాను ఆ పాలను ప్రతీరోజూ శివుడి పూజకు వాడుతానని తెలిపారు. తన మత విశ్వాసాలను పాల వ్యాపారి ఉద్దేశపూర్వకంగా అపవిత్రం చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల దర్యాప్తులో నిందితుడు పప్పు అనే మారుపేరుతో పాలు పంపిణీ చేస్తున్నాడని, అతని అసలు పేరు మహమ్మద్ షరీఫ్ అని తేలింది. ఈ విషయం తెలియగానే అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఇది 'స్పిట్ జిహాద్'లో భాగమేనని సంస్థ జాతీయ అధికార ప్రతినిధి శిశిర్ చతుర్వేది ఆరోపించారు. పవిత్రమైన కణ్వర్ యాత్ర జరుగుతున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం తీవ్రమైన విషయమని, నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై సీనియర్ పోలీస్ అధికారి శశాంక్ సింగ్ మాట్లాడుతూ "సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేశాం. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది, విచారణ అనంతరం నిందితుడిపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు.
Mohammed Sharif
Lucknow
milk vendor
spit jihad
Uttar Pradesh
Hindu Mahasabha
Shiv Puja
religious sentiments
crime
CCTV footage

More Telugu News