Allu Arjun: అమెరికాలో 'పుష్ప' మేనియా.. 'తెలుగు వారంటే వైల్డ్ ఫైర్' అన్న అల్లు అర్జున్

Allu Arjun Pushpa Mania Grips America at NATS 2025
  • అమెరికాలో ఘనంగా 'నాట్స్ 2025' ఉత్సవాలు
  • వేడుకలకు హాజరైన అల్లు అర్జున్, సుకుమార్, రాఘవేంద్రరావు, శ్రీలీల
  • 'పుష్ప' డైలాగులతో అభిమానులను ఉర్రూతలూగించిన బన్నీ
  • తన 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న దర్శకేంద్రుడు
  • అమెరికా తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన సుకుమార్
అమెరికాలో జరిగిన 'నాట్స్ 2025' వేడుకల్లో టాలీవుడ్ తారలు సందడి చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన ‘పుష్ప’ స్టైల్ డైలాగులతో అక్కడి తెలుగు వారిలో ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు దర్శకులు రాఘవేంద్రరావు, సుకుమార్, నటి శ్రీలీల పాల్గొని ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. "తెలుగు వారంటే ఫైర్‌ అనుకున్నారా.. వైల్డ్‌ ఫైర్" అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పి అభిమానులను ఉర్రూతలూగించారు. "నాట్స్ అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్" అని చమత్కరించారు. ఇంతమంది తెలుగు వారిని ఒకేచోట చూస్తుంటే హైదరాబాద్‌లో ఉన్నట్లే ఉందని సంతోషం వ్యక్తం చేశారు. విదేశాల్లోనూ తెలుగు సంస్కృతిని కాపాడుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. "భారతీయులు ఎక్కడున్నా తగ్గేదేలే.. అందులోనూ తెలుగోళ్లు అస్సలు తగ్గేదేలే" అని అనడంతో సభ ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ, ఇది తన 50 ఏళ్ల దర్శక ప్రస్థానమని గుర్తుచేసుకున్నారు. తాను పరిచయం చేసిన అల్లు అర్జున్, శ్రీలీల ఈ వేదికపై ఉండటం ఆనందంగా ఉందన్నారు. "'అడవి రాముడు'లో అడవిని నమ్ముకుని నేను స్టార్ డైరెక్టర్ అయ్యాను. నువ్వు 'పుష్ప'లో అడవిని నమ్ముకుని స్టార్ డైరెక్టర్ అయ్యావు" అంటూ సుకుమార్‌ను ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, తన కెరీర్‌కు పునాది వేసిన '1 నేనొక్కడినే' చిత్రాన్ని ఆదరించినందుకు అమెరికాలోని తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉంటానని తెలిపారు. అలాగే, తెలుగు చిత్ర పరిశ్రమకు మైత్రి మూవీస్ లాంటి గొప్ప నిర్మాణ సంస్థను అందించినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పారు.
Allu Arjun
Pushpa
NATS 2025
Telugu Association
Raghavendra Rao
Sukumar
Sreeleela
Telugu Culture
Telugu Movies
USA

More Telugu News