Vijay: విజయ్‌లా ఉంటే నిర్మాతలకు పండగే.. దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

- తమిళ హీరో విజయ్ పనితీరుపై నిర్మాత దిల్ రాజు ప్రశంసలు
- షూటింగ్ డేట్స్ విషయంలో విజయ్‌కు పక్కా ప్రణాళిక ఉంటుందని వెల్లడి
- నెలకు ఇన్ని రోజులంటూ ముందే డేట్స్ ఇస్తారని కొనియాడిన వైనం
- ఇతర హీరోలు కూడా ఈ పద్ధతి పాటిస్తే నిర్మాతలకు ఎంతో మేలన్న నిర్మాత
- టాలీవుడ్లో ప్రస్తుతం ఈ విధానం లేదని, దాన్ని తిరిగి తెస్తామని వ్యాఖ్య
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమిళ హీరో విజయ్ పనితీరు, క్రమశిక్షణపై ప్రశంసలు కురిపించారు. షూటింగ్ డేట్స్ విషయంలో విజయ్‌కు ఉండే స్పష్టతను మెచ్చుకుంటూ, మిగతా హీరోలు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకుంటే సినీ పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
దిల్ రాజు మాట్లాడుతూ... "విజయ్ పని చేసే పద్ధతి చాలా బాగుంటుంది. సినిమా ఎప్పుడు మొదలుపెట్టాలి, ఎప్పుడు పూర్తి చేయాలి అనే దానిపై ఆయనకు పూర్తి క్లారిటీ ఉంటుంది. ఉదాహరణకు ఒక సినిమాకు 120 రోజులు అవసరమైతే, ప్రతి నెలా తాను 20 రోజులు డేట్స్ ఇస్తానని ముందే చెప్పేస్తారు. దీనివల్ల ఆరు నెలల్లో సినిమా షూటింగ్ పూర్తవుతుంది" అని వివరించారు.
హీరో ముందుగానే డేట్స్ ఇస్తే, మిగతా టీమ్ అంతా బాధ్యతగా, ఒత్తిడి లేకుండా పక్కా ప్రణాళికతో పనిచేస్తుందని ఆయన తెలిపారు. "హీరో ప్రతి నెలా 15 లేదా 20 రోజులు డేట్స్ ఇస్తున్నారని తెలిస్తే, ఆ సమయానికి తగ్గట్టుగా పనులు పూర్తి చేయాలనే సానుకూల ఒత్తిడి అందరిలో ఉంటుంది. దీనివల్ల అనుకున్న సమయానికి సినిమా పూర్తవుతుంది" అని దిల్ రాజు అన్నారు.
అయితే, టాలీవుడ్లో ప్రస్తుతం ఇలాంటి పద్ధతి కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న ఈ మంచి విధానాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కాగా, దిల్ రాజు నిర్మాణంలో విజయ్ హీరోగా 'వారసుడు' చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే.