Nidhhi Agerwal: వేణు స్వామితో పూజలు చేయించుకున్న నిధి అగర్వాల్!

Nidhhi Agerwal Performs Special Pooja with Venu Swamy
  • 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు ముందు ప్రత్యేక పూజలు
  • ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామితో పూజలు చేయించుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్
  • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పూజల వీడియో
  • గతంలో పూజల తర్వాతే నిధికి అవకాశాలు పెరిగాయంటున్న అభిమానులు
  • సినిమాల విజయం కోసమేనంటూ నెట్టింట జోరుగా చర్చ
టాలీవుడ్ ‘ఇస్మార్ట్’ బ్యూటీ నిధి అగర్వాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆధ్వర్యంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’ విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నిధి, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకుని స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె కెరీర్‌లో కీలకమైన రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. పవన్ కల్యాణ్ సరసన నటించిన ‘హరిహర వీరమల్లు’ జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రభాస్‌తో కలిసి నటిస్తున్న ‘రాజా సాబ్’ కూడా చిత్రీకరణ దశలో ఉంది. ఈ రెండు సినిమాల విజయం తన కెరీర్‌కు ఎంతో ముఖ్యమని భావిస్తున్న నిధి, వాటి సక్సెస్ కోసం ప్రత్యేకంగా ఈ పూజలు చేయించుకున్నారని ప్రచారం జరుగుతోంది.

నిధి అగర్వాల్ వేణు స్వామిని సంప్రదించడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఆయన సలహాలు, సూచనలు పాటించిన తర్వాతే ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయని, కెరీర్ గాడిన పడిందని అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. మళ్లీ అదే సెంటిమెంట్‌తో సినిమా విడుదల ముందు పూజలు చేయించారని భావిస్తున్నారు. 

గతంలో రష్మిక మందన్న, డింపుల్ హయతి, అషు రెడ్డి వంటి పలువురు తారలు కూడా వేణు స్వామిని కలవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, నిధి పూజల వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. "పూజలు చేస్తే సినిమాలు హిట్ అవుతాయా?" అని కొందరు ప్రశ్నిస్తుండగా, "వేణు స్వామి టైమ్ మళ్ళీ మొదలైంది" అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Nidhhi Agerwal
Nidhhi Agerwal pooja
Venu Swamy
Hari Hara Veera Mallu
Pawan Kalyan
Raja Saab
Prabhas
Tollywood
Telugu movies
Ismart Shankar

More Telugu News