Raghurama Krishnam Raju: నాకు ఒక్క రోజు హోంమినిస్టర్ పదవి ఇస్తే రెడ్ బుక్ కాదు... అంతా బ్లడ్ బుక్కే!: రఘురామ

Raghurama Krishnam Raju If I Were Home Minister It Would Be Blood Book
  • అమెరికాలో తానా 24వ మహాసభలు
  • హాజరైన రఘురామ
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ స్పీకర్
అమెరికాలో నిర్వహించిన తానా 24వ ద్వైవార్షిక మహాసభల్లో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్కరోజు గనుక మిమ్మల్ని రాష్ట్ర మంత్రిగా చేస్తే మీరు ఏ శాఖలు కోరుకుంటారు? అని కార్యక్రమ యాంకర్ మూర్తి ప్రశ్నించారు. అందుకు రఘురామ బదులిస్తూ, రోజులో 8 గంటలు తనను మంత్రిగా చేస్తే 6 గంటలు హోంమంత్రిగా, మిగతా 2 గంటలు వైద్య ఆరోగ్య మంత్రిగా పనిచేస్తానని అన్నారు. 

మీరు హోంమంత్రి అయితే  రెడ్ బుక్ అమలు చేస్తారా అని యాంకర్ మూర్తి అడగ్గా... తన వద్ద రెడ్ బుక్ ఉండదని, అది వేరే వాళ్ల వద్ద ఉందని రఘురామ బదులిచ్చారు. అయితే, తనదగ్గర బ్లడ్ బుక్ ఉందని స్పష్టం చేశారు. గతంలో తనపై జరిగిన అరాచకాల తాలూకు రక్తపు చారలు తనకు ఇంకా గుర్తున్నాయని రఘురామ అన్నారు. ఆ విధంగా తాను బ్లడ్ బుక్ తో ముందుకెళతానని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. 
Raghurama Krishnam Raju
TANA 2023
Andhra Pradesh
AP Assembly
Home Minister
Red Book
Blood Book
Deputy Speaker
Politics

More Telugu News