Hussaini Brahmins: మొహర్రం నెలలో శోకసంద్రంలో మునిగిపోయే బ్రాహ్మణులు.. ఎవరీ హుస్సేనీ బ్రాహ్మణులు?

- ఇమామ్ హుస్సేన్ కోసం త్యాగం.. తరాలుగా సంతాపం పాటిస్తున్న హిందూ కుటుంబాలు!
- కర్బాలా యుద్ధానికి, బ్రాహ్మణులకు ఉన్న సంబంధం గురించి ఆసక్తికర చరిత్ర
- ఇమామ్ హుస్సేన్ అమరత్వానికి గుర్తుగా షియాల సంతాప దినాలు
- మొహర్రం రోజున విషాదాన్ని పాటించే హుస్సేనీ బ్రాహ్మణులు
మొహర్రం అనగానే ముస్లింలు, ముఖ్యంగా షియా వర్గం వారు ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరించుకుంటూ పాటించే శోక దినాలు గుర్తుకొస్తాయి. కానీ, హిందూ మతంలోని ఒక బ్రాహ్మణ వర్గం కూడా మొహర్రంను పాటిస్తుందన్న విషయం చాలామందికి తెలియదు. వారే "హుస్సేనీ బ్రాహ్మణులు" లేదా "మోహ్యల్ బ్రాహ్మణులు". మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే వీరి కథ ఎంతో ఆసక్తికరమైనది.
చారిత్రక కథనాల ప్రకారం.. కర్బలా యుద్ధ సమయంలో రాహబ్ సిధ్ దత్ అనే హిందూ వర్తకుడు ఇమామ్ హుస్సేన్‌కు మద్దతుగా నిలిచారు. ఆయనకు ప్రవక్త ముహమ్మద్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండేవని చెబుతారు. ఇమామ్ హుస్సేన్‌ను కాపాడే క్రమంలో, రాహబ్ సిధ్ దత్ తన ఏడుగురు కుమారులను యుద్ధంలో బలిదానం చేశారని చరిత్రకారులు పేర్కొంటారు. ఆ త్యాగానికి గుర్తుగానే, ఆయన వంశానికి చెందిన వారు నేటికీ హుస్సేనీ బ్రాహ్మణులుగా మొహర్రం నెలలో విషాదాన్ని పాటిస్తున్నారు.
ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల అయిన మొహర్రంను రంజాన్ తర్వాత అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మొహర్రం పదో రోజును 'అషూరా' అంటారు. ఈ రోజునే ఇమామ్ హుస్సేన్ అమరులయ్యారు. షియా ముస్లింలు ఈ సందర్భాన్ని తీవ్రమైన దుఃఖంతో స్మరించుకుంటే, సున్నీ ముస్లింలు ఉపవాసంతో పవిత్ర దినంగా పాటిస్తారు. ఈ నేపథ్యంలో, రాహబ్ సిధ్ దత్ వారసులైన హుస్సేనీ బ్రాహ్మణులు నేటికీ మొహర్రం సమయంలో ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరించుకుంటూ సంతాప దినాలను పాటిస్తున్నారు.