బీజేపీకి ఉపశమనం... ఢిల్లీలో ఓడినా బలం పెంచుకుంటున్న కాషాయ దళం !

  • గత ఎన్నికలతో పోల్చితే ఐదారు రెట్లు ఎక్కువ స్థానాలు
  • చివరి వరకు ఆధిక్యం నిలబడితే అదో ఘనత
  • ఆప్‌ స్థానాలను కొల్లగొట్టిన కమలనాథులు
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమ్‌ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్‌ సాధించినా దాని బలం గణనీయంగా తగ్గింది. గెలుపు ఆశలు పెట్టుకుని చతికిలపడిన బీజేపీ గతంతో పోల్చుకుంటే తన బలాన్ని గణనీయంగా పెంచుకుని సంతోషపడుతోంది. 2015 ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలతో సరిపెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఈసారి తన బలాన్ని 20 స్థానాలకు పెంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులు ఈ స్థానాల్లో మెజార్టీలో ఉన్నారు.

మరోవైపు గత ఎన్నికల్లో 67 స్థానాలు సాధించి అప్రతిహత మెజార్టీ సొంతం చేసుకున్న ఆప్‌ ఈసారి 50 స్థానాలకే పరిమితమయ్యేలా ఉంది. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో మరోసారి సామాన్యుడినే కొలువు దీర్చాలని అక్కడి ప్రజలు నిర్ణయం తీసుకున్నా అసెంబ్లీలో తన బలాన్ని అమాంతం ఐదారు రెట్లకు పెంచుకోవడం బీజేపీకి ఎంతోకొంత ఊరటనిచ్చే పరిణామం అంటే అతిశయోక్తి కాదు.


More Telugu News