తన మాజీ పీఎస్ ఇళ్లపై ఐటీ దాడుల గురించి చంద్రబాబు తేలుకుట్టిన దొంగలా ఉన్నాడు: విజయసాయిరెడ్డి
- దీనిపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపట్లేదు?
- ఏబీవీ సస్పెన్షన్‌పై మాత్రం కాస్త ధైర్యం తెచ్చుకుని మాట్లాడాడు
- అధికారులపై వేధింపులకు పాల్పడుతున్నారని అక్కసు వెళ్లగక్కాడు
- వాళ్లకు ఏ పాపం తెలియదని మాత్రం అనలేకపోయాడు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద అప్పట్లో పర్సనల్ సెక్రెటరీగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాలు తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే, దీనిపై చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
'తన మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇళ్లపై ఐటీ దాడుల గురించి నోరు మెదపకుండా తేలుకుట్టిన దొంగలా ఉన్న చంద్రబాబు ఏబీవీ సస్పెన్షన్‌పై మాత్రం కాస్త ధైర్యం తెచ్చుకుని మాట్లాడాడు. అధికారులపై ఫ్యాక్షన్ వేధింపులకు పాల్పడుతున్నారని అక్కసు వెళ్లగక్కాడు. వాళ్లకు ఏ పాపం తెలియదని మాత్రం అనలేకపోయాడు' అని విజయసాయిరెడ్డి విమర్శిస్తూ ట్వీట్ చేశారు.