‘అమరావతి నా రాజధాని’ పేరుతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్న శోభారాణి
- అమరావతి రైతుల పోరాటానికి శోభారాణి మద్దతు
- నటి దివ్యవాణితో కలిసి సినిమా నిర్మాణం
- ఉద్యమ వాస్తవ ఘటనలతో రూపొందనున్న సినిమా
టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన హైకోర్టు న్యాయవాది చందోలు శోభారాణి, ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత టీడీపీలో చేరారు. అయితే, ఆ తర్వాత కూడా ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చిన ఆమె.. ఏపీ పరిణామాలపై స్పందిస్తున్నారు. అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నారు.
తాజాగా, శోభారాణి ఓ కీలక ప్రకటన చేశారు. టీడీపీ నేత, సినీ నటి దివ్యవాణితో కలిసి ‘అమరావతి నా రాజధాని’ పేరుతో సినిమా నిర్మించనున్నట్టు తెలిపారు. ఉద్యమంలో జరుగుతున్న వాస్తవ ఘటనల ఆధారంగా నెల రోజుల్లోనే చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మండిపడ్డారు. రాజధాని రైతుల పోరాటానికి జగన్ తలవంచక తప్పదని శోభారాణి తేల్చి చెప్పారు.