ఓటమికి నైతిక బాధ్యత.. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ రాజీనామా

  • ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం
  • ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ ప్రభావం చూపలేకపోయిన కాంగ్రెస్ 
  • గతంలో పోలిస్తే దిగజారిన ఓట్ల శాతం
ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. గెలుపు తమదేనని చివరి వరకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన బీజేపీ గతంతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ అంచనాలకు ఆమడదూరంలో నిలిచింది.

ఇక, ఎన్నికలకు ముందే కాడిపడేసిన కాంగ్రెస్ పత్తా లేకుండా పోయింది. ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ ప్రభావం చూపలేకపోయింది. అంతేకాదు, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఆ పార్టీకి పోలైన ఓట్లశాతం కూడా గణనీయంగా పడిపోయింది. 2015 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 9.7 శాతం ఓట్లు పోలవగా, ఈసారి అది 4.27 శాతానికి దిగజారింది. దీంతో ఈ ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ ఢిల్లీ చీఫ్ సుభాష్ చోప్రా తన పదవికి రాజీనామా చేశారు.


More Telugu News