గ్రామ స్థాయి నుంచే ఎన్నికల సంస్కరణలు చేపట్టాలి: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి
- స్థానికులే ఎన్నికల్లో పాల్గొనాలి
- ఎన్నికల సమయంలో బెదిరింపులకు పాల్పడితే జరిమానా, జైలు
- ధనం, మద్యం ప్రాబల్యం తగ్గేలా చట్టంలో మార్పులు
గ్రామ స్థాయి నుంచే ఎన్నికల సంస్కరణలు చేపట్టాలని భావించి పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు తెచ్చామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానికులే ఎన్నికల్లో పాల్గొనేలా మార్పులు చేశామని చెప్పారు.
స్థానికేతరులు పోటీ చేస్తే స్థానిక సంస్థలు నిర్వీర్యమవుతాయని, ధనం, మద్యం ప్రాబల్యం తగ్గించేందుకు, ఎన్నికల సమయంలో బెదిరింపులకు పాల్పడితే జరిమానా, జైలు శిక్ష విధించేలా ఈ చట్టంలో మార్పులు తెచ్చినట్టు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమయాన్ని కుదించామని చెప్పిన పెద్దిరెడ్డి, ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణలో మార్పుల ద్వారా సత్ఫలితాలు వస్తాయని ఆకాంక్షించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ ఎన్నికల్లో 90 శాతానికి పైగా స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని చెప్పారు.