ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు ఎందుకు పెట్టలేదు: పవన్ నిలదీత
- కర్నూలులోని బండిమెట్ట ప్రాంతంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం
- సాధారణ కేసు నమోదు చేయడంపై పవన్ ఆగ్రహం
- రాష్ట్ర మహిళా కమిషన్ వెంటనే స్పందించాలని డిమాండ్
కర్నూలులోని బండిమెట్ట ప్రాంతంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. నిందితుడిపై సాధారణ కేసు నమోదు చేశారని తన దృష్టికి వచ్చిందని చెప్పారు. మైనర్లపై లైంగిక దాడి చేస్తే పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాలని చట్టం చెబుతున్నప్పటికీ సాధారణ కేసుగా పరిగణించడమేంటని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర మహిళా కమిషన్ వెంటనే స్పందించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కర్నూలులో పర్యటిస్తోన్న పవన్ను కలిసిన బీజేపీ నాయకురాలు వినీషా రెడ్డి ఈ కేసు వివరాలను ఆయనకు వివరించారు. ఆ చిన్నారిపై ఖాజా మొహినుద్దీన్ (40) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన రాజకీయ కారదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.