హెచ్ సీయూ విద్యార్థినికి రూ.43 లక్షల ప్యాకేజీ
- రూ.43 లక్షల ప్యాకేజీతో ఉద్యోగమిచ్చిన అడోబ్ సిస్టమ్స్ కంపెనీ
- హెచ్ సీయూ చరిత్రలో ఇదే అత్యధికం
- ఈ ఏడాదిలో 200 మందికి పైగా విద్యార్థులకు ఉద్యోగాలు
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ) విద్యార్థినికి అడోబ్ సిస్టమ్స్ కంపెనీ భారీ ప్యాకేజీ ఆఫర్ చేసింది. స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ లో ఎంసీఏ విద్యనభ్యసిస్తున్న విద్యార్థిని వి.నందిని సోనీకి క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భారీ ప్యాకేజీ లభించింది. అడోబ్ సిస్టమ్స్ కంపెనీలో రూ.43 లక్షల వార్షిక వేతనం లభించే ఉద్యోగానికి ఆమె ఎంపికైంది.
హెచ్ సీయూ చరిత్రలో ఇప్పటివరకు ఓ విద్యార్థి లేదా విద్యార్థిని పొందిన అత్యధిక ప్యాకేజీ ఇదే. ఈ ఏడాది తమ క్యాంపస్ రిక్రూట్ మెంట్లో 200 మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు పొందారని యూనివర్సిటీ ప్లేస్ మెంట్స్ అండ్ అడ్వైజరీ బ్యూరో ఛైర్మన్ రాజీవ్ వాంకర్ తెలిపారు. ఈ ప్యాకేజీ రావడంపట్ల విద్యార్థిని నందిని సంతోషం వ్యక్తం చేస్తూ.. తాను తొలుత ఇంజినీరింగ్ కోర్సు చేయాలనుకున్నానని చెబుతూ.. అనంతరం నైపుణ్యం కలగిన సాఫ్ట్ వేర్ డెవలపర్ కావాలన్న లక్ష్యంతో ఎంసీఏ లో చేరినట్లు వెల్లడించారు.