కరోనా ఎఫెక్ట్ దృశ్యాలు: కూరగాయల షాపులో అమ్మకందారు కనపడడు.. ఆ భార్యాభర్తలు చూసుకునేది వారానికోసారే!

  • చాలా ప్రాంతాల్లో ఆంక్షలు అమలు
  • డాక్టర్లు, పోలీసులకు 24 గంటలూ పనే..
  • అన్ని చోట్లా సేఫ్టీ కోసం చర్యలు
కరోనా వైరస్ ధాటికి అల్లాడుతున్న చైనాలో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. వైరస్ దాడి మొదలైన వూహాన్ పట్టణం ఉన్న ప్రావిన్స్ తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు ఇంకా నిర్బంధంలోనే ఉన్నాయి. ఇండ్లలోంచి ఎవరినీ బయటికి రానివ్వడం లేదు. నిత్యావసరాల సరఫరా మినహా మరే రకమైన ట్రాన్స్ పోర్ట్ ఉండటం లేదు. మరికొన్ని ప్రావిన్స్ లలో మాత్రం పరిస్థితి కొంత మెరుగుగా ఉంది. అయితే ఎవరూ కూడా మరొకరికి దగ్గరగా వెళ్లేందుకు జంకే పరిస్థితి ఉంది. డాక్టర్లు, పోలీసులు వారికి వీలైనంత టైం పనిచేస్తూనే ఉండాలని గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడంతో.. వారు ఇంటికి కూడా వెళ్లడం లేదు. ఈ పరిస్థితిపై కొన్ని ఫొటోలు..

అమ్మేవాళ్లు లేకుండానే కూరగాయలు..

చైనాలోని హుబే ప్రావిన్స్ లో ఉన్న షిజియాజ్వాంగ్ లో అమ్మేవాళ్లు లేకుండా పెట్టిన కూరగాయల దుకాణాలు ఇవి. దగ్గరగా ఉంటే వైరస్ సోకుతుందన్న భయంతో ఓనర్లు దూరంగా ఉండి ఇట్లాంటి షాపులు నిర్వహిస్తున్నారు. అవసరమైన వాళ్లు వచ్చి, తమకు కావాల్సినవి తీసుకుని డబ్బులు అక్కడ పెట్టాలి. లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆన్ లైన్లో చెల్లించాలి.

భార్యాభర్తలు చూసుకునేది వారానికోసారే..

జెజియాంగ్ ప్రావిన్స్ లోని ఝౌషాన్ చెక్ పాయింట్ వద్ద డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ యాంగ్, మెడికల్ స్టాఫ్ మెంబర్ అయిన ఆయన భార్య ఫాంగ్ ఫొటోలు ఇవి. కరోనాపై ఫైటింగ్ పోరులో ఉన్న వాళ్లిద్దరూ వారానికోసారి మాత్రమే కలుసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆ టైంలో ఫొటోలివి..

వైరస్ ప్రొటెక్షన్ సూట్లు ఎన్ని కుట్టినా సరిపోవడం లేదు 

హుబే ప్రావిన్స్ నింగ్జింగ్ కౌంటీలో ఉన్న వైరస్ ప్రొటెక్షన్ సూట్ల తయారీ కేంద్రం ఇది. వైరస్ బాధితుల సంఖ్య బాగా పెరిగిపోతుండటం, ఎక్కువ మంది డాక్టర్లు, సిబ్బంది అవసరం పడుతుండటంతో ప్రొటెక్షన్ సూట్లు సరిపోవడం లేదు. దాంతో చాలా కంపెనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా ప్రొటెక్షన్ సూట్లను తయారు చేస్తూనే ఉన్నారు.

ఎక్కడికక్కడ సేఫ్టీ చర్యలు

వైరస్ వ్యాప్తి చెందకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోడ్లు, దుకాణాలు, జనం సంచరించే ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ ను అడ్డుకునే కెమికల్స్ ను స్ప్రే చేస్తున్నారు. సూపర్ మార్కెట్లు,ఆఫీసులు సహా ఎక్కడికెళ్లినా వారి ఆరోగ్య పరిస్థితిని చెక్ చేసిగానీ లోపలికి పంపడం లేదు. క్యూలో నిలబడి చెక్ చేసుకోవాల్సి వస్తోంది.


More Telugu News