200 మిలియన్ వ్యూస్ ను సాధించిన 'రాములో రాములా ..'

  • సంచలన విజయాన్ని సాధించిన 'అల వైకుంఠపురములో'
  • మ్యూజికల్ హిట్ గా నిలబెట్టిన తమన్ 
  • దుమ్మురేపేస్తున్న 'రాములో రాములా ..'
అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' భారీ విజయాన్ని సాధించింది. అన్ని తరగతుల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా, వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేసింది. అల్లు అర్జున్ కెరియర్లోనే చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. తమన్ అందించిన స్వరాల కారణంగా ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా ఆల్బమ్ లో 'సామజ వర గమన'.. 'బుట్టబొమ్మా'.. 'రాములో రాములా' పాటలు ఒక ఊపు ఊపేశాయి. ముఖ్యంగా 'రాములో రాములా' పాట 200 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుని కొత్త రికార్డును సృష్టించింది. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో, కథానాయికగా పూజా హెగ్డే అలరించిన సంగతి తెలిసిందే. ఇదే కాంబినేషన్లో 2022లో మరో సినిమా పట్టాలెక్కే అవకాశం వున్నట్టుగా తెలుస్తోంది.


More Telugu News