ఆయన లేని లోటు పూడ్చలేనిది: దర్శకుడు రాజ్ కుమార్ మృతిపై చిరంజీవి
- నటునిగా శిక్షణ తీసుకుంటూండగానే నటింపజేశారు
- నా నటజీవితానికి పునాదిరాళ్లు ఆ సినిమాతోనే
- రాజ్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన చిరు
తన సినీ జీవితానికి పునాది వేసిన దర్శకుడు రాజ్ కుమార్ మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గూడపాటి రాజ్ కుమార్ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. రాజ్ కుమార్ మృతిపై చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
‘ఫిల్మ్ ఇన్సిట్యూట్ లో నేను శిక్షణ తీసుకుంటున్న సమయంలో రాజ్ కుమార్ నన్ను కలిసి ‘పునాదిరాళ్లు’ సినిమాలో నటించమని కోరారు. శిక్షణ పూర్తి కాకుండా నటించడం ఎలా అని అడిగినప్పటికీ ఆయన ఊరుకోలేదు. చివరికి ఆయన బలవంతం మీద ఆ సినిమాలో నటించాను. అదే నా నట జీవితానికి పునాదిరాళ్లు వేసింది. ఇటీవల కొంతకాలం క్రితం ఆయన మా ఇంటికి వచ్చి నన్ను కలిశారు. అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పడంతో అపోలో ఆస్పత్రికి పంపించి వైద్య పరీక్షలు చేయించడం జరిగింది. త్వరలో ఆరోగ్యంతో నన్ను కలవడానికి వస్తారనే అనుకున్నాను. ఆయన మృతి చెందడం చాలా బాధాకరం. అయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’ అని చిరంజీవి పేర్కొన్నారు.