త్రివిక్ర‌మ్‌కి నోటీసులు పంపుతా: దర్శకుడు కృష్ణ

  • అల వైకుంఠ పురం కథ నాది
  • 2005లో త్రివిక్ర‌మ్‌ని క‌లిశాను
  • ఈ కథను చెప్పాను
  • 2013లో ఈ క‌థ‌ని రిజిస్ట‌ర్ చేసుకున్నా 
టాలీవుడ్ దర్శకుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌కు లీగ‌ల్ నోటీసులు పంపిస్తాన‌ని కృష్ణ అనే దర్శకుడు తెలిపాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠ‌పుర‌ములో సినిమా వచ్చిన విషయం తెలిసిందే. 2005లో త్రివిక్ర‌మ్‌ని క‌లిసిన కృష్ణ అల వైకుంఠ పురములో కథను చెప్పాడట. అంతేగాక, 2013లో ఈ క‌థ‌ని ఆయన ఫిలిం ఛాంబ‌ర్‌లో రిజిస్ట‌ర్ కూడా చేసుకున్నాడని తెలిసింది.

ఈ నేపథ్యంలో త‌న స్క్రిప్ట్ ఫ‌స్ట్ పేజ్ కాపీని తాను దర్శకుడు త్రివిక్ర‌మ్‌కి ఇచ్చాన‌ని కృష్ణ అంటున్నాడు. త‌న క‌థ‌తో అల వైకుంఠ‌పుర‌ములో సినిమా తీశారని ఆయన ఆరోపిస్తున్నాడు. దీంతో త్రివిక్రమ్‌కు నోటీసులు పంపుతానని చెప్పాడు. కాగా, ఇటీవల విడుదలైన అల వైకుంఠ‌పుర‌ములో సినిమా అద్భుత విజయం అందుకుని భారీ వసూళ్లను రాబడుతోంది.


More Telugu News