పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఓయో!

  • 2018 ఆర్థిక సంవత్సరంలో రూ. 370 కోట్ల నష్టం
  • గత సంవత్సరం ఏకంగా రూ. 2,390 కోట్ల లాస్
  • అంతర్జాతీయ విస్తరణ కారణంగానేనని ఓయో వివరణ
దేశవ్యాప్తంగా హోటల్ చైన్ ను నిర్వహిస్తున్న ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ కన్సాలిడేటెడ్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి 2018తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో రూ. 370 కోట్లుగా ఉన్న నష్టాలు, గడచిన ఆర్థిక సంవత్సరంలో రూ. 2,390 కోట్లకు పెరిగాయి. ఈ విషయాన్ని వెల్లడించిన సంస్థ, మొత్తం ఆదాయం మాత్రం 211 మిలియన్ డాలర్ల నుంచి 951 మిలియన్ డాలర్లకు పెరిగిందని వెల్లడించింది. అంతర్జాతీయ విస్తరణ నిమిత్తం అధిక నిధులను కేటాయించడంతోనే నష్టాలు పెరిగాయని పేర్కొన్న సంస్థ, ఇండియాలో సంస్థ కార్యకలాపాలపై నష్టం 24 శాతం నుంచి 12 శాతానికి తగ్గిందని ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ కన్సాలిడేటెడ్ ఓ ప్రకటనలో పేర్కొంది.


More Telugu News