రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
- నాన్ మేజర్ పోర్టుగా నిర్మించాలని భావిస్తున్న ప్రభుత్వం
- జియో కోఆర్డినేట్స్ నోటిఫై చేసిన మౌలిక వనరుల కల్పన శాఖ
- పోర్టుకు 30 కిమీ పరిధిలో మరో పోర్టు నిర్మించరాదని నిర్ణయం
ప్రకాశం జిల్లా రామాయపట్నంలో నిర్మించ తలపెట్టిన పోర్టును నాన్ మేజర్ పోర్టుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విధివిధానాల్లో భాగంగా పోర్టు జియో కోఆర్డినేట్స్ ను మౌలిక వనరుల కల్పన శాఖ నోటిఫై చేసింది. ఏపీ మారిటైమ్ బోర్డు ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపింది. ఈ క్రమంలో పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కిలోమీటర్ల పరిధిలో మరో పోర్టు నిర్మించరాదని నిర్ణయించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై డీపీఆర్ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.