ఉద్యోగులకు హెచ్ఎస్బీసీ షాక్.. 35 వేల మంది తొలగింపు!
- భారీ నష్టాల్లో ఉన్న హెచ్ఎస్బీసీ
- అమెరికా, ఐరోపాల్లో ఉద్యోగుల కోత
- 2,35,000గా ఉన్న ఉద్యోగుల సంఖ్యను 2 లక్షలకు కుదించాలని యోచన
భారీ నష్టాలను ఎదుర్కొంటున్న ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ హెచ్డీఎఫ్సీ తమ ఉద్యోగులకు షాకిచ్చేందుకు రెడీ అయింది. అమెరికా, ఐరోపాలో ఏకంగా 35 వేల మంది ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఎదురైన అనిశ్చితికి తోడు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమించడం, కోవిడ్-19 ప్రభావం ఎదురయ్యే అవకాశం ఉందని బ్యాంకు భావిస్తోంది.
హెచ్ఎస్బీసీ తాత్కాలిక సీఈవోగా ఉన్న నోయెల్ క్వీన్ ఆసియాలో సంస్థను లాభాల బాట పట్టించాలని భావిస్తున్నారు. అయితే, వ్యాపారం ఆశించిన రాబడి ఇవ్వకపోవడంతో పెట్టుబడిదారులకు రాబడి పెంచేందుకు క్వీన్ సరికొత్త ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు, రాబోయే మూడేళ్లలో ఉద్యోగుల సంఖ్యను 2,35,000 నుంచి రెండు లక్షలకు తగ్గించాలని యోచిస్తున్నట్టు ‘బ్లూమ్బర్గ్’ న్యూస్ వెల్లడించింది.