ఎఫ్ఎం రేడియో స్టేషన్లకు రామజోగయ్య శాస్త్రి విజ్ఞప్తి

  • లిరిక్ రైటర్లకు తగిన గుర్తింపు రావడంలేదని భావిస్తున్న రామజోగయ్య
  • లిరిక్ రైటర్ పేరును కూడా ప్రస్తావించాలని ఎఫ్ఎం స్టేషన్లకు విన్నపం
  • తన ట్వీట్ రీట్వీట్ చేయాలంటూ ఇతర గేయ రచయితలకు సూచన
ఇటీవల కాలంలో సినీ గేయ రచయితలకు సరైన గుర్తింపు దక్కడంలేదంటూ ప్రముఖ లిరిక్ రైటర్ రామజోగయ్యశాస్త్రి ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడంలేదని అనేక సందర్భాల్లో ఆయన వాపోయారు. తాజాగా, అన్ని తెలుగు ఎఫ్ఎం రేడియో స్టేషన్లకు ఓ విజ్ఞప్తి చేశారు. ప్రియమైన ఎఫ్ఎం స్టేషన్లకు, ఓ పాటను ప్రసారం చేస్తున్నప్పుడు దయచేసి పాటను రాసిన లిరిక్ రైటర్ పేరును కూడా ప్రస్తావించండి. ఇది మా లిరిక్ రైటర్లందరి తరఫు నుంచి విన్నపం అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, ఈ ట్వీట్ ను రీట్వీట్ చేయండి సోదరులారా అంటూ చంద్రబోస్, భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీలకు సూచించారు.


More Telugu News