చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన భువనేశ్వరి
- విశాఖలో చంద్రబాబు అరెస్ట్
- ఎయిర్ పోర్టు వీఐపీ లాంజ్ కు తరలించిన పోలీసులు
- చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న భువనేశ్వరి
టీడీపీ అధినేత చంద్రబాబును విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకుని ఎయిర్ పోర్టు వీఐపీ లాంజ్ కు తరలించిన సంగతి తెలిసిందే. కొన్నిగంటలుగా ఆయన లాంజ్ లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి కొద్దిసేపటి క్రితం వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. చంద్రబాబుతో మాట్లాడి, అనంతరం ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా, చంద్రబాబును పోలీసులు విజయవాడ తిప్పి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.