రేపు కాకపోతే ఆ తర్వాతైనా విశాఖ వచ్చి తీరుతా: చంద్రబాబు
- విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబుతో డీసీపీ చర్చలు
- హైదరాబాద్ వెళ్లేందుకు అయిష్టంగానే అంగీకరించిన చంద్రబాబు
- బాబును హైదరాబాద్ పంపించిన పోలీసులు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర పర్యటన నుంచి అర్ధంతరంగా వెనుదిరిగారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు సమ్మతించలేమని పోలీసులు చెప్పడంతో ఆయన విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. అంతకుముందు, ఎయిర్ పోర్టు వీఐపీ లాంజ్ లో డీసీపీ ఉదయ్ భాస్కర్ టీడీపీ అధినేత చంద్రబాబుకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు.
దీనికి చంద్రబాబు బదులిస్తూ, "రేపైనా రానివ్వరా, అయితే ఎల్లుండి వస్తా, అప్పటికీ రానివ్వకపోతే ఆ మరుసటి రోజైనా విశాఖ వచ్చి తీరుతా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెడతానని అనుకోవద్దు" అంటూ స్పష్టం చేశారు. దానికి పోలీసు అధికారి బదులిస్తూ, పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. 'ఏంటయ్యా పరిస్థితులు?' అంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రబాబు, పోలీసుల సూచనను అయిష్టంగానే అంగీకరించినట్టు తెలుస్తోంది.