'బంగార్రాజు'కి లైన్ క్లియర్
- నాగార్జున సరసన రమ్యకృష్ణ
- చైతూ జోడీగా రష్మిక?
- జూన్ నుంచి సెట్స్ పైకి
నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో 'సోగ్గాడే చిన్ని నాయన' ఒకటిగా కనిపిస్తుంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో ఆయన పోషించిన 'బంగార్రాజు' పాత్రకి మంచి ఆదరణ లభించింది. దాంతో ఆ పాత్రనే టైటిల్ గా సెట్ చేసుకుని, అదే కల్యాణ్ కృష్ణతో కలిసి సెట్స్ పైకి వెళ్లాలని నాగార్జున నిర్ణయించుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు లేట్ అవుతూ వచ్చింది.
తాజాగా పరిస్థితులన్నీ అనుకూలంగా మారడంతో, జూన్ నుంచి ఈ సినిమాను పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణనే కనిపిస్తుంది. చైతూ జోడీగా రష్మికను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అన్నపూర్ణ బ్యానర్లో ఇటు నాగార్జునకి .. అటు చైతూకి హిట్లు ఇచ్చిన కల్యాణ్ కృష్ణ, ఈ ఇద్దరికీ కలిపి భారీ విజయాన్నే అందిస్తాడేమో చూడాలి.