గవర్నర్ దృష్టికి విశాఖ ఘటనను తీసుకెళ్లాం: వర్ల రామయ్య
- ఈ ఘటన గురించి తనకు తెలుసని గవర్నర్ మాతో చెప్పారు
- రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోంది
- విశాఖ ఘటనే ఇందుకు నిదర్శనం
విశాఖలో చంద్రబాబును అడ్డుకున్న ఘటనపై టీడీపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ ను టీడీపీ ప్రతినిధుల బృందం కలిసింది. విజయవాడలోని రాజ్ భవన్ లో ఇవాళ ఆయన్ని కలిసి ఈ మేరకు ఓ వినతిపత్రం అందజేసింది.
అనంతరం మీడియాతో వర్ల రామయ్య మాట్లాడుతూ, గవర్నర్ దృష్టికి విశాఖ ఘటనను తీసుకెళ్లామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన విషయాలు తనకు తెలుసని గవర్నర్ తమకు చెప్పారని అన్నారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని, విశాఖ ఘటనే ఇందుకు నిదర్శనమని అన్నారు.
విశాఖలో చంద్రబాబు యాత్రకు పోలీసులు అనుమతినిచ్చారని, అయినప్పటికీ ఈ విధంగా ప్రవర్తించడం దారుణమని మండిపడ్డారు. చంద్రబాబు పర్యటనకు ముందు రోజే సీఎంతో డీజీపీ ఎందుకు సమావేశమయ్యారు? అని ప్రశ్నించారు. శాంతి భద్రతలను కాపాడడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు.
దేశ ప్రతిష్టనూ జగన్ దెబ్బతీస్తున్నారు: గద్దె అనూరాధ
రాజధాని అమరావతి రైతుల ఆందోళనపై సీఎం జగన్ ఒక్కసారి కూడా మాట్లాడలేదని టీడీపీ నాయకురాలు గద్దె అనూరాధ విమర్శించారు. అమరావతిని రాజధానిగా నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఆమోదించారని, ఇప్పుడు ఎందుకు మాట తప్పారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రతిష్టనే కాదు దేశ ప్రతిష్టను కూడా జగన్ దెబ్బతీస్తున్నారని విమర్శించారు.