పాలు, పెరుగు తీసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు తక్కువట!
- గుర్తించిన ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ పరిశోధకులు
- తొమ్మిది దేశాల్లోని 4.18 లక్షల మందిపై పరిశోధన
- ఆహారపు అలవాట్లు, ఆరోగ్యాన్ని పరిశీలించన పరిశోధకులు
మనిషి శరీరంలోని రక్తనాళాల్లో ఏదైనా అవరోధం కలగడాన్ని స్ట్రోక్ అంటారు. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మెదడు కణాలు త్వరగా నిర్వీర్యం అవటం ప్రారంభిస్తాయి. నిలువెత్తు మనిషిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ ప్రమాదకర స్థితి వల్ల మనిషి అకాల మరణం చెందుతాడు. అయితే, మనం తినే ఆహారంలో భాగంగా పాలు, పెరుగు, జున్ను, పండ్లు బాగా తీసుకుంటే ఈ ముప్పును అధిగమించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
తొమ్మిది దేశాల్లోని 4.18 లక్షల మంది ఆహారపు అలవాట్లు, ఆరోగ్యాన్ని పరిశీలించి ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. ఫైబర్ అత్యధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, కోడిగుడ్లు తిన్నా మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తవని చెప్పారు.