హైదరాబాద్ వరుస బాంబు పేలుళ్ల కుట్ర కేసుపై తీర్పు.. కరీం తుండా నిర్దోషి

  • 1998లో వరుస బాంబు పేలుళ్ల కుట్ర కేసు
  • కరీంపై ఆరోపణలకు లభించని సాక్ష్యాధారాలు
  • నిర్దోషిగా ప్రకటించిన నాంపల్లి న్యాయస్థానం
హైదరాబాద్ లో వరుస బాంబు పేలుళ్ల కుట్ర కేసులో నాంపల్లి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాను నిర్దోషిగా ప్రకటించింది. ఈ మేరకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా, 1998లో వరుస బాంబు పేలుళ్లకు కుట్ర పన్నాడని ఆరోపిస్తూ కరీంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కరీంపై ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించలేకపోయారు. దీంతో, డిఫెన్స్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం, కరీంను నిర్దోషిగా ప్రకటించింది.

1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా దేశ వ్యాప్తంగా అల్లర్లు జరగడమే కాదు, బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారు. ఇందులో భాగంగా టిఫిన్ బాక్సుల్లో బాంబులు అమర్చి హైదరాబాద్ లోని హుమాయున్ నగర్, సీసీఎస్ వద్ద, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో విధ్వంసానికి కుట్ర పన్నాడని ఆరోపిస్తూ నాడు పోలీసులు కేసులు నమోదు చేశారు.


More Telugu News