'మగధీర'లో చేయకపోవడమే నేను చేసిన పొరపాటు: నటి అర్చన
- రాజమౌళిగారు అవకాశం ఇచ్చారు
- కొన్ని కారణాల వలన చేయలేకపోయాను
- మరో అవకాశం కూడా వదులుకున్నానన్న అర్చన
తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో అర్చన ఒకరు. 'శ్రీరామదాసు' సినిమాలో ఆమె చేసిన 'సీత' పాత్ర మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆమె చాలా సినిమాల్లో నటించినప్పటికీ, ఆ స్థాయిలో గుర్తింపు తీసుకురాలేదు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, అనేక ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించింది.
"రాజమౌళిగారు 'మగధీర' సినిమా చేసే సమయంలో, ఒక ముఖ్యమైన పాత్రకిగాను నన్ను సంప్రదించారు. అయితే ఆ సమయంలో నేను వేరే సినిమాలతో బిజీగా ఉండటం వలన అంగీకరించలేకపోయాను. ఆ తరువాత ఆ పాత్రని 'సలోని' చేసింది. ఆ పాత్రను చేయలేకపోయినందుకు నేను ఇప్పటికీ బాధపడుతూ వుంటాను.
ఆ తరువాత కూడా ఒక స్టార్ డైరెక్టర్ తన చిత్రంలో కథానాయికగా నాకు అవకాశం ఇచ్చారు. కొన్ని కారణాల వలన ఆ సినిమాను కూడా నేను చేయలేకపోయాను. వేరే హీరోయిన్ చేసిన ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకుని వుంటే నా కెరియర్ వేరేలా ఉండేది. వాటిని వదులుకోవడం నిజంగా నేను చేసిన పొరపాటే" అని చెప్పుకొచ్చింది.