బుల్లెట్లతో పార్లమెంటు ఆవరణలోకి వచ్చిన వ్యక్తి.. కలకలం!

  • అదుపులోకి తీసుకున్న భద్రతాదళాలు
  • ఆ వ్యక్తికి లైసెన్స్ కలిగిన తుపాకీ ఉన్నట్టు విచారణలో వెల్లడి
  • తన జేబులో బుల్లెట్లు ఉన్నాయనే విషయాన్ని గమనించలేదన్న అక్తర్ ఖాన్
పార్లమెంటు ఆవరణలోకి బుల్లెట్లతో ఓ వ్యక్తి ప్రవేశించడంతో కలకలం రేగింది. ఈ ఘటన నిన్న చోటు చేసుకుంది. అక్తర్ ఖాన్ అనే వ్యక్తి బుల్లెట్లతో పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించారు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా బలగాలు ఆయనను అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించాయి. పోలీసు విచారణలో అక్తర్ ఖాన్ కు లైసెన్స్ ఉన్న తుపాకీ ఉన్నట్టు తేలింది.

అయితే పొరపాటున బుల్లెట్లు తీయకుండానే ప్రవేశించినట్టు తమ విచారణలో తేలిందని పోలీసు అధికారులు తెలిపారు. విచారణ పూర్తైన తర్వాత ఎలాంటి పొరపాటు లేదని తెలుసుకుని ఆయనను విడుదల చేశామని వెల్లడించారు. పోలీసు విచారణ తర్వాత అక్తర్ ఖాన్ మాట్లాడుతూ, తన జేబులో బుల్లెట్లు ఉన్నాయనే విషయాన్ని తాను గమనించలేకపోయానని, పొరపాటున బుల్లెట్లతో పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించానని పోలీసులకు చెప్పానని తెలిపారు.


More Telugu News