'ఎస్‌ బ్యాంకు'కు చంద్రబాబు ఏపీ టూరిజం నిధులను దోచిపెట్టాడు!: విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

  • ఎస్‌ బ్యాంకును అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని లూటీ చేశాడు
  • రూ.1,300 కోట్ల రూపాయల టీటీడీ నిధులు డిపాజిట్ చేయించాడు
  • కమీషన్లు తీసుకున్నాడు
  • సుబ్బారెడ్డి గారు సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది
ఎస్‌ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఎస్‌ బ్యాంక్‌ సంక్షోభంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు.  

'చంద్రబాబు ఎస్‌ బ్యాంకును అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని లూటీ చేశాడు.1,300 కోట్ల రూపాయల టీటీడీ నిధులు డిపాజిట్ చేయించి కమీషన్లు తీసుకున్నాడు. ఛైర్మన్ సుబ్బారెడ్డి గారు సకాలంలో స్పందించి డిపాజిట్లను వెనక్కు తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఎస్‌ బ్యాంకుకు ఏపీ టూరిజం శాఖ నిధులనూ దోచిపెట్టాడు. ఇంకెన్ని ఉన్నాయో?' అని ఆరోపించారు. ఇందుకు రుజువుగా ఆయన ఎస్‌ బ్యాంకుకు సంబంధించిన ఓ స్క్రీన్‌ షాట్‌ను పోస్ట్ చేశారు.



More Telugu News