స్థానిక సంస్థల ఎన్నికల ఎఫెక్ట్‌: ఏపీలో టెన్త్‌ పరీక్షల తేదీల్లో మార్పులు

  • ఈ నెల 31వ తేదీ నుంచి మొదలు
  • 23వ తేదీ నుంచి జరగాల్సిన పరీక్షలు ‌
  • 29వ తేదీ వరకు ఎన్నికలతో తాజా నిర్ణయం
అనుకున్నట్టే అయింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే పదో తరగతి పరీక్షలు వాయిదా పడతాయేమోనని భావించిన తల్లిదండ్రుల ఊహ నిజమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో ఈ నెల 23వ తేదీ నుంచి జరగాల్సిన టెన్త్‌ పరీక్షలు 31వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఆ మేరకు పరీక్షలను రీ షెడ్యూల్‌ చేశారు.

 మారిన తేదీల వివరాలు ఇలా వున్నాయి. మార్చి 31న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, ఏప్రిల్‌ 1న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2, ఏప్రిల్‌ 3న సెకండ్‌ లాంగ్వేజ్ పేపర్‌, ఏప్రిల్‌ 4న ఇంగ్లీష్‌ పేపర్‌-1, ఏప్రిల్‌ 6న ఇంగ్లీష్‌ పేపర్‌-2, ఏప్రిల్‌ 7న మ్యాథమేటిక్స్‌ పేపర్‌-1, ఏప్రిల్‌ 8న మ్యాథమేటిక్స్‌ పేపర్‌-2, ఏప్రిల్‌ 9న జనరల్‌ సైన్స్‌ పేపర్‌-1, ఏప్రిల్‌ 11న జనరల్‌ సైన్స్‌ పేపర్‌-2, ఏప్రిల్ 16న ఓఎస్‌ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2, ఏప్రిల్ 17న ఎస్‌ఎస్‌ఎస్సీ ఒకేషనల్ కోర్స్ థియరీ పరీక్షలు జరగనున్నాయి.


More Telugu News