సమగ్రంగా దర్యాప్తు జరిపితే చంద్రబాబుకు ఎంత ముట్టిందో బయటపడుతుంది: 'యస్ బ్యాంకు స్కాం'పై విజయసాయిరెడ్డి
- రాణా కపూర్ ను ఈడి అరెస్టు చేసింది
- యస్ బ్యాంకు అక్రమ లావాదేవీల గుట్లన్నీ చేతికి చిక్కాయి
- ఎల్లో మీడియా విలవిల్లాడుతోంది
యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ, సీఈఓ రాణా కపూర్‌ను ఎన్‌ఫోర్స్‌మెం ట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద ఆయనను అరెస్టు చేయడం జరిగింది. ఆయనను విచారించేందుకు ఈ నెల 11 వరకు కస్టడీకి ఆదేశిస్తూ, ముంబైలోని సెషన్స్ కోర్టు ఈడీ అధికారులకు అనుమతినిచ్చింది. ఈ విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై పలు ఆరోపణలు చేశారు.
'రాణా కపూర్ ను ఈడి అరెస్టు చేసింది. యస్ బ్యాంకు అక్రమ లావాదేవీల గుట్లన్నీ చేతికి చిక్కాయి. సమగ్రంగా దర్యాప్తు జరిపితే చంద్రబాబుకు ఎంత ముట్టింది కచ్చితంగా బయటపడుతుంది. తమ దేవుడికి ఒకేసారి ఇన్ని కష్టాలు వచ్చిపడ్డాయేమిటని ఎల్లో మీడియా విలవిల్లాడుతోంది' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.