నెల్లూరులో కలకలం.. కరోనా వైరస్ తొలి కేసు నమోదు
- 14 రోజుల క్రితం ఇటలీ నుంచి వచ్చిన యువకుడు
- నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స
- నెల్లూరు వ్యాప్తంగా పలు చర్యలు తీసుకుంటున్న జిల్లా కలెక్టర్
నెల్లూరులో కరోనా వైరస్ తొలి కేసు నమోదైంది. 14 రోజుల క్రితం ఇటలీ నుంచి వచ్చిన ఓ యువకుడిని పరీక్షించిన అనంతరం వైద్యులు అతడిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఆ యువకుడు నెల్లూరు చిన్న బజారుకు చెందిన వ్యక్తి. అతడు కొన్ని రోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. ప్రాధమిక పరీక్షలలో ఈ విషయం తేలింది. దీనితో అతడి నుంచి శాంపిల్స్ సేకరించిన వైద్యులు వాటిని నిర్ధారణ కోసం పూణే పంపించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆ జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నెల్లూరులో జరగాల్సిన పలు కార్యక్రమాలను వాయిదా వేశారు.